NTV Telugu Site icon

PM Modi: వారికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం..

Pm

Pm

PM Modi: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలది కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెడతారని విమర్శించారు. కానీ, తమ పార్టీ మాత్రం ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి కోసం ముందుకు సాగుతోందని అన్నారు. ఎన్డీయే కూటమి నేతలంతా ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

Read Also: Tamil Nadu: మహిళలపై తమిళనాడు మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖులు ఫైర్

అయితే, ప్రతిపక్షాలు కుటుంబంతో కలిసి.. కుటుంబం కోసం (పరివార్ కా సాథ్ పరివార్ కా వికాస్) అనే విధానాన్ని అనుసరిస్తాయని నరేంద్ర మోడీ ఆరోపించారు. కానీ, దానికి విరుద్ధంగా తాము సబ్‌ కా సాథ.. సబ్‌కా వికాస్ అనే నినాదంతో ముందుకు పోతున్నాం.. ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశామని వెల్లడించారు. వాటిలో 130 తాగు నీటి ప్రాజెక్టులు, నాలుగు గ్రామీణ రోడ్లు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, 356 గ్రంథాలయాలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: TTD: గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ..

ఇక, గతంలో పూర్వాంచల్‌లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండేవి.. కానీ, నేడు కాశీ పూర్వాంచల్ ఆరోగ్య రాజధానిగా మారిపోతుందని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. భారత్‌ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో ముందుకు దూసుకుపోతున్నాం.. 2036లో జరగబోయే ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నాం.. అందుకు పర్మిషన్ తీసుకోవడానికి అధికారులు ట్రై చేస్తున్నారని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన కాశీ ఎప్పటికీ తనదే.. తాను కాశీకి చెందిన వాడినని నరేంద్ర మోడీ వెల్లడించారు.