PM Modi: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మోడీ ఫోన్.. విషయం ఏంటంటే..?

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ఫోన్‌లో మాట్లాడారు. జూన్‌లో ఇటలీలో జరిగే G7 సమ్మిట్‌కు ఆహ్వానం పంపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. జార్జియా మెలోనికి, ఇటలీ ప్రజలకు 79వ విమోచన దినోత్సం సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read Also: Khalistan: లండన్ భారత రాయబార కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడి అరెస్ట్..

‘‘జూన్‌లో జరిగే G7 సమ్మిట్‌కు ఆహ్వానం పంపినందుకు ఆమెకు ధన్యవాదాలు. జీ-7లో జీ-20 ఇండియా ఫలితాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించాము. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించాము’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఇరువురు నేతలు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.