NTV Telugu Site icon

PM Modi security breach: ప్రధాని భద్రతా ఉల్లంఘన.. రెండేళ్ల తర్వాత పోలీస్ అధికారి సస్పెండ్..

Pm Modi

Pm Modi

PM Modi security breach: పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన గతేడాది చర్చనీయాంశంగా మారింది. అత్యంత రక్షణ ఉండే ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌పై ఆందోళనకారులు నిలిపేశారు. పంజాబ్ పోలీస్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భద్రతా ఉల్లంఘన జరిగనట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జనవరి 5, 2022 రోజున పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు మోడీ వెళ్లిన క్రమంలో, రైతులు ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.

Read Also: Bigg Boss 7 Telugu: ప్రశాంత్ కు, అశ్వినికి ఇచ్చిపడేసిన నాగ్.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?

ప్రధానికి సరైన భద్రతా కలిపించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో చరణ్ జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఘటన జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత బటిండా సీనియర్ ఎస్పీ(ఎస్ఎస్పీ) గుర్బిందర్ సింగ్‌ని శనివారం సస్పెండ్ చేశారు.

ప్రధాని భద్రతా ఉల్లంఘన కేసులో భటిండా ఎస్ఎస్పీ గుర్బిందర్ సింగ్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భద్రతా ఉల్లంఘనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం హోంశాఖ ఆదేశించినట్లు కేంద్ర డిప్యూటీ సెక్రటరీ అర్చనా వర్మా లేఖలో పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ మరియు అప్పీల్), రూల్స్, 1969 కింద క్రమశిక్షణా చర్యల సహా చట్టం కింద చర్యలు తీసుకున్నారు.