Site icon NTV Telugu

PM Modi: 11 ఏళ్లలో భారత్ వేగంగా వృద్ధిని సాధిస్తుంది..

Modi

Modi

PM Modi: మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేటి (జూన్ 9న)కి ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో తన 11 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. అలాగే, ప్రస్తుత కేంద్ర మంత్రులలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు చిత్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన తిప్పికొట్టారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు, సమిష్టి కృషితో దేశం విభిన్న రంగాలలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని అన్నారు. ఇక, సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ సూత్రంతో ఎన్‌డీయే ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ప్రధాని మోడీ వెల్లడించారు.

Read Also: Vizag Metro Train: విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్..!

ఇక, ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజలను కేంద్రీకరించి.. అందరినీ కలుపుకుని, సమగ్ర పురోగతిపై దృష్టి కేంద్రీకరించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏళ్ల పాటు మా సమిష్టి విజయం పట్ల మేము గర్విస్తున్నాం.. అలాగే, వికసిత్ భారత్‌ను నిర్మించాలనే నూతన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. వివిధ రంగాలలో అనేక మార్పులకు నాంది పలికామని అన్నారు. అలాగే, ఎక్స్ పోస్ట్‌లో “11 సంవత్సరాల సేవ” అనే హ్యాష్‌ట్యాగ్‌ను నరేంద్ర మోడీ ఉపయోగించారు.

Exit mobile version