Site icon NTV Telugu

Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!

Modi

Modi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించడం శాంతి స్థాపనకు కీలకమైన ముందడుగు అని మోడీ తెలిపారు. ఈ మేరకు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: US: వెనిజులా తీరంలో మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దాడి.. నలుగురు హతం

గాజాలో శాంతి స్థాపనకు ఇటీవల ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ముందు పెట్టారు. దీనికి వెంటనే ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. కానీ హమాస్ స్పందించలేదు. ఇక ట్రంప్ ప్రణాళికను ఆయా దేశాలు కూడా స్వాగతించాయి. అలాగే ప్రధాని మోడీ కూడా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే శాంతి ప్రణాళిను హమాస్ అంగీకరించకపోవడంతో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికను అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Trump-Hamas: ట్రంప్ ప్లాన్‌పై హమాస్ సంచలన నిర్ణయం

అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్‌పై దాడి చేసింది. నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచి పెట్టాలని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హమాస్ బందీల విడుదలకు అంగీకారం తెల్పడంతో పాలస్తీనా ఖైదీల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది.

 

Exit mobile version