Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
- ట్రంప్‌పై మోడీ ప్రశంసలు
- గాజాలో శాంతి స్థాపనకు పూనుకున్నారని అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించడం శాంతి స్థాపనకు కీలకమైన ముందడుగు అని మోడీ తెలిపారు. ఈ మేరకు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: US: వెనిజులా తీరంలో మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దాడి.. నలుగురు హతం
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
గాజాలో శాంతి స్థాపనకు ఇటీవల ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ముందు పెట్టారు. దీనికి వెంటనే ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. కానీ హమాస్ స్పందించలేదు. ఇక ట్రంప్ ప్రణాళికను ఆయా దేశాలు కూడా స్వాగతించాయి. అలాగే ప్రధాని మోడీ కూడా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే శాంతి ప్రణాళిను హమాస్ అంగీకరించకపోవడంతో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికను అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Trump-Hamas: ట్రంప్ ప్లాన్‌పై హమాస్ సంచలన నిర్ణయం
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్‌పై దాడి చేసింది. నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచి పెట్టాలని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హమాస్ బందీల విడుదలకు అంగీకారం తెల్పడంతో పాలస్తీనా ఖైదీల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది.
We welcome President Trump’s leadership as peace efforts in Gaza make decisive progress. Indications of the release of hostages mark a significant step forward.
India will continue to strongly support all efforts towards a durable and just peace.@realDonaldTrump @POTUS
— Narendra Modi (@narendramodi) October 4, 2025
- Tags
- GAZA
- Hamas
- Israel
- modi
- PM Modi praise
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!