Site icon NTV Telugu

PM Modi: సింధూరం తొలగిస్తే ఏమవుతుందో పాకిస్తాన్కి చూపించాం..

Modi

Modi

PM Modi: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మీడియాతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేశారు. దేశ ప్రజలందరి తరఫున సైన్యానికి నా అభినందనలు చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌ సింధూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని తెలిపారు. అయితే, పహల్గామ్‌ దాడితో ఉగ్రదాడులు పర్యాటకులను టార్గెట్‌ చేశారు.. అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారని పేర్కొన్నారు. నాకు వ్యక్తిగతంగా ఇది ఎంతో దారుణమైన విషయం.. ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించింది అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: Congress: జమ్మూ కాశ్మీర్‌ని పాక్‌లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్.. బీజేపీ విమర్శలు..

అయితే, ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు చూపించాం అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌ సింధూర్‌ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన.. ఆపరేషన్‌ సింధూర్‌ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ అని కొనియాడారు. ఏడో తేదీ తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది అన్నారు. కాగా, భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది.. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో దాడి చేసి చూపాం.. దేశమే ప్రథమం అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Exit mobile version