ప్రధాని మోడీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలను, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. వారణాసి నగరంలో రూ.1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడి ప్రసంగించారు. చాలా రోజుల తరువాత వారణాసి ప్రజలను కలుసుకునే అవకాశం వచ్చిందని, కాశీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కాశీవిశ్వేశ్వరుడి ఆశీర్వాదంతోనే జరుగుతుందని అన్నారు. దేశంలో పెద్దరాష్ట్రమైన యూపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు జరిగినట్టు ప్రధాని మోడి తెలిపారు. దేశంలో ప్రస్తుతం క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయని, అయినప్పటీ కాశీనగరం అలసిపోలేదని, పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌ను యూపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో తీసుకున్న చర్యలు భేష్ అని అన్నారు. ఇక యూపీలో ఆక్సీజన్ ప్లాంట్లను పెంచుతున్నామని, ఒక్క వారణాసిలోనే 14 ప్లాంట్లను నెలకొల్పినట్టు మోడి పేర్కొన్నారు.
Read: పవన్ మూవీ నుండి ప్రసాద్ మూరెళ్ళ ఎందుకు తప్పుకున్నాడు!?