పవన్ మూవీ నుండి ప్రసాద్ మూరెళ్ళ ఎందుకు తప్పుకున్నాడు!?

పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా సూర్యదేవర నాగవంశీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే మూవీ తాజా షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. కానీ రెండు వారాలు వాయిదా పడింది. దాంతో కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ళ అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వల్లే లేటెస్ట్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాలేదనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని చిత్ర బృందం ఖండించింది.

Read Also : స్టార్ హీరోయిన్ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ఎంట్రీ ?

సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయ్యిందని, దర్శకుడు సాగర్ చంద్రకు కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ళకు మధ్య చక్కని అనుబంధమే ఉందని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షెడ్యూల్స్ లో జరిగిన మార్పులు చేర్పులతో ప్రసాద్ మూరెళ్ళ వేరే కమిట్ మెంట్స్ తో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని స్పష్టం చేసింది. ఈ విషయమై నిర్ణయం చాలా ముందే జరిగిందని, ఇప్పుడు షెడ్యూల్ ఆలస్యం కావడానికి ప్రసాద్ మూరెళ్ళ తప్పుకోవడానికి సంబంధమే లేదని తేల్చి చెప్పింది చిత్రబృందం. ఆయన స్థానంలో రవి కె చంద్రన్ ను ఎంపిక చేసి కూడా చాలా రోజులే అయినట్టు తెలుస్తోంది. వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టగానే వచ్చే వారంలో సినిమాను తిరిగి పట్టాలెక్కిస్తారన్నది ఇన్ సైడ్ టాక్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-