Site icon NTV Telugu

PM Modi: అస్సాంలో మోడీ పర్యటన.. మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం

Modi5

Modi5

ప్రధాని మోడీ అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఇక మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. ముందుగా దిబ్రూగఢ్ జిల్లాలోని చాబువా ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆయన.. అనంతరం మోరన్‌లోని ELFకు చేరుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130 విమానంలో వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.. మోడీని వేదికపైకి స్వాగతించి సత్కరించారు. ఇక మోరాన్ బైపాస్‌లోని అత్యవసర ల్యాండింగ్ సౌకర్యంపై నుంచి సుఖోయ్ టేకాఫ్ అయింది. ప్రధానమంత్రి మోడీ ప్రత్యక్షంగా వీక్షించారు. గత మూడు నెలల్లో అస్సాంకు మోడీ రావడం ఇది మూడవసారి. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ELF ప్రత్యేకత ఇదే..
ఈశాన్య భారతదేశంలో ఇది మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ. ఇక్కడ నుంచి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు ల్యాండింగ్.. టేకాఫ్ అవుతాయి. భారత వైమానిక దళంతో సమన్వయంతో అభివృద్ధి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేయొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యూహాత్మక అవసరాల సమయంలో కూడా సహాయ, రెస్క్యూ కార్యకలాపాలకు ఇది కీలకం కానుంది. ఈ నిర్మాణం 40 టన్నుల వరకు బరువున్న యుద్ధ విమానాలను, 74 టన్నుల గరిష్ట టేకాఫ్ బరువు కలిగిన రవాణా విమానాలను నిర్వహించగలదు. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త సౌకర్యం జాతీయ అత్యవసర పరిస్థితులు, మానవతా కార్యకలాపాల సమయంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు, రవాణా విమానాలకు అత్యవసర ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యం గల ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగపడునుంది.

మోరాన్ చైనా సరిహద్దు నుంచి దాదాపు 300 కిలోమీటర్లు.. మయన్మార్ సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండటం విషయం. ELF వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంలో ఉంది. బుధవారం నుంచే ఎయిర్‌స్ట్రిప్‌లో ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం, టేకాఫ్ అవ్వడం చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.

 

Exit mobile version