Site icon NTV Telugu

Jairam Ramesh: అందుకోసమే ప్రధాని మోడీ ఇటలీ వెళ్తున్నారు.. కాంగ్రెస్ నేత విమర్శలు..

Jairam Ramesh Pm Modi

Jairam Ramesh Pm Modi

Jairam Ramesh: ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 13-14 తేదీల్లో ఇటలీలోని అపులియా వేదికగా జరిగే జీ-7 సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు మోడీ అక్కడికి వెళ్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా నరేంద్రమోడీకి ఆహ్వానం పంపించారు. ఈ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శించారు.

Read Also: WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?

అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్ట తగ్గిందని, తన ప్రతిష్టను కాపాడుకునేందుకే ఆయన ఇటలీకి వెళ్తున్నారని జైరాం రమేష్ అన్నారు. 2007లో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పర్యటను పోలుస్తూ.. మన్మోహన్ సింగ్ ‘‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’’గా ఉద్భవించారని, స్వీయ ప్రగల్భాల ద్వారా కాదని ప్రధాని మోడీని విమర్శించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జపాన్ దేశాల జీ-7 సమ్మిట్ 1970ల చివరి నుంచి జరుగుతోందని, 1997,2014 మధ్య రష్యా కూడా ఇందులో సభ్యదేశంగా ఉండేదని, 2003 నుంచి ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలను కూడా జీ -7 సమావేశాలకు ఆహ్వానించబడ్డాయని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ అన్నారు.

2007లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో మన్మోహన్ సింగ్ అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రపంచ వాతావరణ మార్పు చర్చలలో సమానత్వాన్ని నిర్ధారించడానికి ‘సింగ్-మెర్కెల్ ఫార్ములా’ను ప్రపంచానికి అందించారని రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ గుర్తు చేశారు. పీఎం మోడీని ఎగతాళి చేస్తూ, ఆయన మూడో వంతు ప్రధాని అని సంబోధించారు. చరిత్రను పీఎం మోడీ అంగీకరిస్తారని ఆశించలేమని ఆయన అన్నారు. అంతర్జాతీయ క్షీణించిన తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ రోజు ఇటలీకి ప్రధాని వెళ్తున్నారని విమర్శించారు. G7 సమ్మిట్‌లో భారతదేశం పాల్గొనడం ఇది 11వ మరియు G7 సమ్మిట్‌లో PM మోడీ వరుసగా ఐదవ పాల్గొనడం.

Exit mobile version