దేశంలో మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడనున్నాయి.
వారణాసి-ఖజురహో..
వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి మతపరమైన, సాంస్కృతిక నగరాలను కలుపుకుని వెళ్లుంది. ఇది ప్రస్తుత రైళ్లతో పోలిస్తే సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా చేస్తుంది. ఈ రైళ్లు యాత్రికులు, పర్యాటకులకు ఖజురహో వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
లక్నో-సహరాన్పూర్..
ఈ ప్రయాణాన్ని దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేయడానికి సహాయపడుతుంది. దాదాపు 1 గంట సమయం ఆదా అవుతుంది. ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారాన్‌పూర్‌లను కలుపుతుంది. రూర్కీ ద్వారా హరిద్వార్‌కు కూడా సులభంగా చేరుకోవచ్చు.
ఫిరోజ్‌పూర్-ఢిల్లీ..
ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు. ఇది కేవలం 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, బటిండా, పాటియాలా వంటి కీలకమైన నగరాలను ఢిల్లీతో కలుపుతుంది. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఎర్నాకులం – బెంగళూరు..
దక్షిణ భారతదేశంలో ప్రయాణ సమయాన్ని 2 గంటలకు పైగా తగ్గించి కేవలం 8 గంటల 40 నిమిషాలకు తగ్గిస్తుంది. ఎర్నాకులం – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను అనుసంధానించడంలో కూడా సహాయపడుతుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
#WATCH | Varanasi, UP | PM Narendra Modi flags off four new Vande Bharat Express trains from Banaras Railway Station
The new Vande Bharat Express trains will operate on the Banaras–Khajuraho, Lucknow–Saharanpur, Firozpur–Delhi, and Ernakulam–Bengaluru routes
(Source: DD) pic.twitter.com/2GfI45aVGt
— ANI (@ANI) November 8, 2025