Site icon NTV Telugu

PM Modi: నా ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయి.. డార్జిలింగ్‌ విషాదంపై మోడీ ఆవేదన

Pmmodi

Pmmodi

పశ్చిమబెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. డార్జిలింగ్‌లో వంతెన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తీవ్ర బాధాకరం అన్నారు. తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Gyanesh Kumar: బీహార్‌లో ఈసారి కొత్త విధానం.. బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండల్లో కుండపోత వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ విధ్వంసం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు సిలుగుడి-మరిక్‌ ప్రాంతాలను కలిపే బాలసోన్‌ నదిలోని ఇనుప వంతెన దూదియా దగ్గర కుప్పకూలింది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. కలింపాంగ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది.

ఇది కూడా చదవండి: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!

అలాగే 717 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో సిక్కిం-సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఇక భూటాన్‌లో భారీ వర్షాలతో బెంగాల్‌కు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

 

Exit mobile version