Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!

  • మోదీ-ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ
  • ట్రేడ్, డిఫెన్స్ అంశాలపై చర్చ
  • ఎనర్జీ, క్రిటికల్ టెక్నాలజీలపైనా సమీక్ష
  • భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ
Moditrump

Moditrump

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇరువురు నేతలు వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతపై చర్చించారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత్ – అమెరికా ద్వైపాక్షిక సహాకరంలోని పలు అంశాలను సమీక్షించినట్లు మోడీ వెల్లడించారు. ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం పరస్పర సంప్రదింపులు, సన్నిహిత సమన్వయం కొనసాగించడంపై పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ప్రధాని చెప్పారు.

ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రపంచశాంతి గురించి ఇద్దరు నేతలు దృష్టిసారించారు. అంతర్జాతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు కలిసి పనిచేయాలనే తమ ఆకాంక్షను ఇద్దరు నాయకులు వ్యక్తం చేశారు. భారత్-అమెరిక సంబధాలు ప్రస్తుతం వాణిజ్య పరంగా కీలక దశలో ఉ న్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇకా తుది దశకు రాలేదు. ఈ నేపథ్యంలో మోడీ, ట్రంప్ ఫోన్ కాల్‌పై ప్రాధాన్యత ఏర్పడింది.