NTV Telugu Site icon

PM Modi: మై ‘డియర్ ఫ్రెండ్’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోడీ విషెస్

Modi

Modi

PM Modi: వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో జరిగిన కార్యక్రమంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు ట్రంప్‌నకు అభినందనలు.. భారత్- అమెరికా దేశాల మధ్య ప్రయోజనాలు, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడం కోసం మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను అంటూ పేర్కొన్నారు. మీ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

Read Also: Astrology: జనవరి 21, మంగళవారం దినఫలాలు

ఇక, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలి ప్రసంగంలోనే పలు ప్రకటనలు చేశారు. యూఎస్ లో నేటి నుంచి స్వర్ణయుగం స్టార్ట్ అయిందన్నారు. “అమెరికా ఫస్ట్” అనేది నా నినాదం.. అనేక అటుపోట్లను తట్టుకుని మన దేశం నిలబడిందన్నారు. ఇవాళ్టి నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుందని వెల్లడించారు. అంతేగాక, అమెరికాలో నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే విద్య రంగంలో సంస్కరణలు తీసుకొస్తాం.. అమెరికా దక్షిణ సరిహద్దు్లో కఠిన ఆంక్షలు విధిస్తాం.. అక్రమ వలసలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికాలోకి నేరగాళ్లు రాకుండా, ఉగ్రవాదాన్ని అణచివేస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.