NTV Telugu Site icon

గుజ‌రాత్‌లో ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ స‌ర్వే

PM aerial survey

గుజ‌రాత్‌లో టౌటే తుఫాన్ బీభ‌త్సం సృష్టించిన ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఉనా, డ‌యూ, జ‌ఫ‌రాబాద్‌, మ‌హువా ప్రాంతాల్లో స‌ర్వే నిర్వ‌హించిన ఆయ‌న‌.. తుఫాన్‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.. మ్యాప్‌ల‌ను, శాటిలైట్ ఇమేజ్‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. గుజ‌రాత్‌లోని కోస్ట‌ల్ జిల్లాల్లో ప్ర‌ధాని ఏరియ‌ల్ స‌ర్వే కొన‌సాగ‌గా.. అనంత‌రం అధికారుల‌తో అహ్మ‌దాబాద్‌లో తుఫాన్ న‌ష్టంపై స‌మీక్ష నిర్వ‌హించారు.. ఈ స‌మావేశానికి సీఎం విజ‌య్ రూపాని, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. కాగా, టౌటే తుఫాన్ గుజ‌రాత్‌లో బీభ‌త్సం సృష్టించింది.. ఇప్ప‌టి వ‌ర‌కు 45 మంది మృతిచెందిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. అతి భీక‌రంగా విరుచుకుప‌డ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు తెలుస్తున్నారు.. ఇంకా పూర్తిస్థాయిలో అంచ‌నా వేయాల్సి ఉంది. మ‌రి స‌మీక్ష స‌మావేశం త‌ర్వాత‌.. గుజ‌రాత్‌కు ప్ర‌ధాని ఎంత స‌హాయం ప్ర‌క‌టిస్తారో చూడాలి.