హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉనాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత.. ఆయిల్ కిందకు కారి మంటలు వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. హరోలి ప్రాంతంలోని తహ్లివాలా కస్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాగా.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది.