ఓ వైపు సముద్రం.. ఇంకోవైపు భారతమాత సైనికుల బలం తనతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. గోవాలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర సాయుధ దళాల సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గుర్తుగా ఈ ఏడాది దీపావళి వేడుకలు నౌకాదళంతో జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న పొల్యూషన్.. పడిపోయిన గాలి నాణ్యత
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు.. దీపావళి వెలిగించే దీపాలలాంటివి అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చొబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.. ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేడిన్ ఇండియాకు ప్రతీక. బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైళ్లు తమ సత్తా ఏంటో చూపించాయి.’’ అని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఇరుదేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
2014లో మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సాయుధ దళాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గతేడాది గుజరాత్‌లోని కచ్‌లోని సర్ క్రీక్‌లో వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆపరేషన్ సిందూర్ గుర్తుగా గోవా తీరంలో జరుపుకున్నారు.
2014లో లడఖ్‌లో.. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లో.. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో వేడుకలు జరుపుకున్నారు. 2020లో మాత్రం కరోనా సమయంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని లాంగేవాలాలో జరుపుకున్నారు. 2021లో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరాలో సైనికులతో గడిపారు.
Celebrating Diwali with our brave Navy personnel on board the INS Vikrant. https://t.co/5J9XNHwznH
— Narendra Modi (@narendramodi) October 20, 2025
