PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది
- గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించింది
- విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది అని ప్రధాని మోడీ అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఈ ఘన విజయంతో బీజేపీ కార్యకర్తలు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈరోజు చారిత్రాత్మకమైనది.. అపూర్వమైనది.. కార్యకర్తల ఆనందంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, పనితీరు రాజకీయాలపై విశ్వాసం చూపించే రోజు అన్నారు. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని మోడీ పేర్కొన్నారు.
నేటి నుంచి బెంగాల్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. నేడు 20కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ‘‘నాగరిక్ దేవో-భవ’’ మా మంత్రం. ప్రజలు మమ్మల్ని మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నారు.’’ అని అన్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
‘‘బెంగాల్‌లో తొలిసారి భయం కాదు.. ప్రజాస్వామ్యం గెలిచింది. దేశ ప్రజల మనోభావాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్, టీఎంసీ, ఇతరులు కొన్ని రోజుల క్రితం ‘నారీ శక్తి’ని అడ్డుకున్నారు. అందుకే మహిళలు వారిని శిక్షించారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో యుద్ధ సంకేతాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రజలు అటువంటి సమయంలో స్థిరత్వానికే ఓటు వేశారు. బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో ఆయుష్మాన్ భారత్‌కు పచ్చజెండా ఊపుతాం.’’ అని ప్రకటించారు.
‘‘ఇక బెంగాల్‌లో మహిళలకు భద్రత, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. బెంగాల్‌లో భయం, హింస లేని ఈ కొత్త ఉదయం కోసం తరతరాలుగా ఎదురుచూశారు.’’ అని అన్నారు. ‘‘భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్’’ అంటూ ఉత్తేజపరిచే నినాదాలతో మోడీ ప్రసంగాన్ని ముగించారు.
#WATCH | Delhi | PM Narendra Modi ends his address at the BJP HQ after the party is set to achieve a landslide victory in West Bengal and Assam, by saying, "… I express my heartfelt gratitude to all citizens, all voters and all countrymen for making BJP-NDA victorious once… pic.twitter.com/AzyzOsJ5gY
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!