PM Modi: రాహుల్ గాంధీకి గర్వం తలకెక్కింది.. సిక్కుల్ని అవమానించాడు..

  • రాహుల్ గాంధీపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోడీ..
  • ఇటీవల బీజేపీ రవనీత్ బిట్టుపై ‘‘ద్రోహి’’ వ్యాఖ్యలు చేసిన రాహుల్..
  • సిక్కుల్ని అవమానించారని ప్రధాని ఫైర్..
  • యువరాజుకు గర్వం తలకెక్కిందని ఆగ్రహం..
Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రతపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ రావనీత్ బిట్టునుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మోడీ ప్రస్తావించారు. బిట్టుని రాహుల్ గాంధీ ‘‘ద్రోహి’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ నిరసన తెలుపుతూ.. ‘‘ద్రోహి వెళ్తున్నాడు, అతడి ముఖం చూడండి. ద్రోహి మిత్రమా, నువ్వు కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తావు’’ అని అన్నారు. దీనికి బిట్టూ స్పందిస్తూ కాంగ్రెస్ దేశద్రోహి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read Also: Foxtail Millet Idli Recipe: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ.. రైస్ లేకుండానే కొర్రలతో స్పాంజీ లాంటి ఇడ్లీలను ఇలా చేసేసుకోండి!

దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బిట్టు సిక్కు కాబట్టే కాంగ్రెస్ అగ్రనేత ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయనకు సిక్కుల పట్ల ఎలాంటి ద్వేషం ఉందో తెలుస్తోందని మండిపడ్డారు. అతడికి గర్వం తలెక్కిందని, అందుకే చాలా మంది నేతలు కాంగ్రెస్‌ను విడిచిపెడుతున్నారని రాహుల్ గాంధీ పేరు నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని విమర్శలు గుప్పించారు. బిట్టూ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని ప్రధాని అన్నారు.

ఇదేనా మీరు తెరిచిన ‘‘మెహబ్బత్‌ కా దుకాణ్’’ అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు. ప్రతీ విసయంలో విపక్షాలు నిందిస్తున్నాయని, నక్సలిజాన్ని అంతం చేసినందుకు తనను విమర్శిస్తున్నారా.? అని ప్రధాని అడిగారు. తమ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 360 ఎత్తేశామని, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఇంటిలోనే దాడులు చేశామని, కానీ వారు నా సమాధి తవ్వాలని చూస్తున్నారని అన్నారు.