NTV Telugu Site icon

PM Modi: ఇది “తుక్డే తుక్డే గ్యాంగ్” భాష.. కాంగ్రెస్‌‌పై విరుచుకుపడిన ప్రధాని..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన రాజకీయ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని ప్రశ్నించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బీహార్‌‌లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

Read Also: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..

అంతకుముందు మోడీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. రాజస్థాన్ ప్రజలకు ఆర్టికల్ 370తో సంబంధం ఏంటని ఖర్గే ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంతో ఇక్కడి ప్రజలకు ఎందుకు సంబంధం లేదని ఖర్గేని అడిగారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాజస్థాన్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. అది వినడానికి నేను సిగ్గుపడుతున్నాను. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదా..?’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ జాగ్రత్తగా వినాలి, బీహార్ నుంచి చాలా మంది యువకులు, ధైర్యవంతులు మాతృభూమి కోసం భారీ త్యాగాలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ని రక్షించడానికి ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారు’’ అని ప్రధాని అన్నారు.

దేశంలో ఒక ప్రాంతంలో మరో ప్రాంతానికి సంబంధం ఏంటని అడుగుతున్నారని, ఇది తుక్డే తుక్డే గ్యాంగ్ భాష అని ప్రధాని దుయ్యబట్టారు. అలాంటి వారిని క్షమించాలా.? అని ప్రశ్నించారు. ఖర్గే చెప్పిన మాటలు వినడం సిగ్గు చేటని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. ఏప్రిల్ 19న జరిగే తొలి విడత ఎన్నికల్లో బీహార్ లోని నవడా, గయా, ఔరంగాబాద్, జముయి లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.