PM Modi: హైవేపై ప్రధాని మోడీ చారిత్రాత్మక ల్యాండింగ్.. ఎందుకింత ప్రత్యేకం..

  • ఈశాన్యంలో తొలి ELF రన్‌ వే..
  • నేషనల్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్ వే..
  • ఈ రోజు ప్రారంభించిన ప్రధాని మోడీ..
Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం అస్సాంలోని మోరాన్‌లోని హైవేపై ల్యాండ్ అయింది. ఇది చారిత్రాత్మక ల్యాండింగ్‌గా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ELF) వద్ద విమానం ల్యాండ్ అయింది. ఇది దేశ వ్యూహాత్మక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యవసర సమయాల్లో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యేల ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేశారు. శనివారం ఈ రన్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. చైనాకు సమీపంలో ఉండే ఈ రన్ వే చాలా కీలకంగా మారింది.

READ ALSO: Bangladesh: భారత సంబంధాలపై తారిఖ్ రెహ్మన్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

ఈ ప్రాజెక్ట్‌ను రూ. 100 కోట్లతో నిర్మించారు. ఇది సైనిక, పౌర వినియోగాల కోసం దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. మోడీ ప్రయాణిస్తున్న C-130J విమానం చాబువా ఎయిర్‌ఫీల్డ్ నుంచి ELFకు చేరుకుంది. ఇక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 40 నిమిషాల వైమానిక ప్రదర్శన చేసింది. ఈ ఎయిర్ షోలో సుఖోయ్ Su-30MKI, రాఫెల్ ఫైటర్ జెట్లు, An-32 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ALH హెలికాప్టర్లు , గరుడ కమాండోలు పాల్గొన్నారు. ఈ రన్ వే 40 టన్నుల వరకు ఫైటర్ జెట్లు, 74 టన్నుల వరకు ట్రాన్స్‌పోర్ట్ విమానాల నిర్వహణకు అనుకూలంగా ఉంది.