గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.. ఇవాళ రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.. ఇక, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పధాదికారుల సమావేశాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. ఆ తర్వాత ఢిల్లీ చేరుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలదళం.. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాలు నిర్వహిస్తోంది.. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.. గత లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ… ఈసారి అంతకుమించి నెగ్గాలి.. కానీ, తగ్గకూడదు అనే టార్గెట్‌తో ముందుకు సాగుతోంది..
Read Also: PM Anthony Albanese: మరోసారి ఆ దేశ ప్రధానికి కరోనా పాజిటివ్..
ఇక, అందులో భాగంగా 2014, 2019ల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని 144 నియోజకవర్గాలను గుర్తించిన బీజేపీ అధిష్టానం.. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.. 144 లోక్‌సభ స్థానాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి.. దీంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో పాగా వేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది కమలం పార్టీ.. దీనిపై జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ ముందస్తు సమావేశాలు, వ్యూహాలు చూస్తుంటే.. ఏ సీటును వదిలేదు లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.. మరోవైపు, ప్రతిపక్షాలు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్న విషయం విదితమే.