PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!
- బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ
- డబుల్ ఇంజిన్‌తోనే రాష్ట్రానికి మేలు అన్న ప్రధాని
- బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి పనిచేస్తేనే రాష్ట్ర ప్రజలు అత్యధికంగా ప్రయోజనం పొందుతారని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బా మేదినీపూర్ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ వాసులకు ఆరు హామీలు ప్రకటించారు.
1. మొదటి హామీ: బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఉన్న భయానక వాతావరణాన్ని తొలగించి.. న్యాయ పరిపాలనపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కలిగిస్తాం.
Also Read
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
2. రెండవ హామీ: బీజేపీ పాలనలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా ప్రజలకు బాధ్యత వహించేలా జవాబుదారీగా మారుతుంది. పూర్తిగా బాధ్యత వహించేలా ఉంటుంది.
3. మూడవ హామీ: అవినీతి, అక్రమాలు, మహిళలపై జరిగిన అన్యాయాలు, అత్యాచారాల కేసులు సహా అన్ని ఫైళ్లను మళ్లీ పరిశీలిస్తాం.
4. నాల్గో హామీ: టీఎంసీ పాలనలో అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే మంత్రి అయినా, సాధారణ వ్యక్తి అయినా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. ఎవరూ తప్పించుకోలేరు. ఏ ఒక్క టీఎంసీ గూండా కూడా ఇకపై చట్టం నుంచి తప్పించుకోలేడు.
5. ఐదవ హామీ: శరణార్థులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు ఇస్తాం. అయితే చొరబాటుదారులను దేశంలో ఉండనివ్వం. వారిని బయటకు పంపిస్తాం.
6. ఆరవ హామీ: బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం. ఈ హామీలతో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
‘‘ప్రస్తుతం బెంగాల్‌కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అత్యంత అవసరం. డబుల్-ఇంజిన్ ప్రభుత్వం బెంగాల్‌ను మత్స్య, సముద్రపు ఆహార రంగాల్లో స్వయం సమృద్ధిగా చేస్తుంది. బీజేపీ మత్స్య రంగానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాల తర్వాత మా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మత్స్యకారులు, వారి కుటుంబాలు, మొత్తం నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ) అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా మత్స్యకారుల సంక్షేమం కోసం బీజేపీ ప్రత్యేకంగా, రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించింది. అంతేకాకుండా బీజేపీ మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) సౌకర్యాన్ని కల్పించింది. బీజేపీ మత్స్యకారులకు రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీని కూడా అందించింది. లక్షలాది మంది మన తోటి మత్స్యకారులు ఇప్పటికే ఈ ప్రయోజనాన్ని పొందారు. ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం చాలా వేగంగా, సమర్థవంతంగా అమలు చేయబడుతుంది. ’’ అని పేర్కొన్నారు. బెంగాల్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. 294 స్థానాలకు గాను 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుండగా. 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Purba Medinipur, West Bengal: While addressing a public gathering, Prime Minister Narendra Modi says, "I offer six guarantees to West Bengal–
1. Modi’s first guarantee: A BJP government will replace this atmosphere of fear with trust. It will restore faith in the rule… pic.twitter.com/huLBnfJYC2
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Purba Medinipur, West Bengal: While addressing a public gathering, Prime Minister Narendra Modi says, "Bengal's best interest does not lie in animosity towards the Prime Minister; rather, the people stand to gain the most if both the Prime Minister and the Chief Minister… pic.twitter.com/YlMvGIq8O7
— ANI (@ANI) April 9, 2026
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?