PM Modi: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీలో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు.
Read Also: India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేశారు. వరసగా నాలుగోసారి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. ‘‘బంగ్లాదేశ్‌తో మా శాశ్వత మరియు ప్రజల-కేంద్రీకృత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని పీఎం మోడీ చెప్పారు.
ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించడంతో మొత్తం 300 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో హసీనా పార్టీ 223 సీట్లను గెలుచుకుంది. 76 ఏళ్ల షేక్ హసీనా మరోసారి బంగ్లా ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం 41.8 శాతం ఓటింగ్ నమోదైంది. 1991 తర్వాత ఆ దేశంలో ఇదే అత్యల్పం.