న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట కారణంగా 18 మంది మహా కుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా భక్తులు స్టేషన్‌కు రావడం.. సమాచారం విషయంలో గందరగోళం నెలకొనడంతో భక్తులు ఒకేసారి పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 18 మంది చనిపోవడమే కాకుండా.. అధిక సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు వారం పాటు నిలిపివేస్తున్నట్లు అధికారి తెలిపారు. అంతేకాకుండా ఉదయం పూట కూడా పరిమితిలోనే ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Falcon Scam Case: ఫాల్కన్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్
ఇక ఈ దుర్ఘటనపై రైల్వేమంత్రిత్వ శాఖ.. ఇద్దరు సభ్యులతో కూడిన దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. విచారణ కోసం ప్లాట్‌ఫామ్ 14లో సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలించారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి 9:20 గంటల మధ్య ప్రయాణికులు వేచి ఉన్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కోసం వేచి ఉన్నారు. పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Swathi Reddy: పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన కలర్స్ స్వాతి..?
ఈ స్టేషన్‌లో సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రోజుకు 7,000 జనరల్ క్లాస్ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే తొక్కిసలాట జరిగిన రోజున సమయంలో 9,600 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇదే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tuni Municipal Vice Chairman: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా!