PM Modi: 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన బీజేపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల పాట్నా వేదిక జరిగిన విపక్షాల సమావేశం గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. గత రెండు సార్వత్రిక ఎన్ని్కల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలు రెచ్చిపోలేదని.. ఇప్పుడు శత్రువులంతా ఒక్కటయ్యారని ఆయన అన్నారు. ఒకరినొకరు తిట్టుకునే పార్టీలు ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని ఆయన అన్నారు. వారిని చూస్తే జాలేస్తోందని ప్రతిపక్షాలపై ఎద్దేవా చేశారు.
2024 ఎన్నికల ముందు విపక్షాల ఐక్యతను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. ప్రతిపక్షాల భయాల్ని చూస్తే 2024లో ప్రజలు మరోసారి బీజేపీకి ఓటేయాలనే సంకల్పం కనిపిస్తోందని మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్లీన్ క్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు కొన్ని నెలలు ఉండటంతో ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాయని అన్నారు.
Read Also: Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది
ప్రస్తుతం ‘గ్యారెంటీ’ అనే పదం పాపులర్ అవుతోందని.. ఈ మధ్య ఓ ఫోటో సెషన్ మీటింగ్ జరిగింది.. ఈ ఫోటోలు చూస్తే అందరూ కలిసి రూ. 20 లక్షల కోట్ల అవినితీ చేయడం గ్యారెంటీ అని అనిపిస్తోందని ప్రతిపక్ష పార్టీల పాట్నా సమావేశాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, టీఎంసీ, కాంగ్రెస్, ఎన్సీపీల ఉద్దేశిస్తూ.. ఆ పార్టీలకు అవినీతికి సంబంధించిన హామీ మాత్రమే ఉందని, ప్రజలు అవినీతిపరులను శిక్షించే హామీని అంగీకరిస్తారా..? లేక అవినీతి చేసే పార్టీల హామీని అంగీకరిస్తారా..? తేల్చుకోవాలని ప్రధాని సూచించారు.
గత వారం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ మొత్తం 17 పార్టీల నేతల సమావేశం అయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఐక్యంగా బీజేపీ ఓడించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరో సమావేశం వచ్చే నెలలో సిమ్లాలో జరగబోతోంది.