A Group Of 20 Members Attacked On Family With Knife In Vijayawada: విజయవాడంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత కుటుంబసభ్యులపై.. 20 మంది దుండగులు గుంపుగా వచ్చి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వివాహితను ఎందుకు వేధిస్తున్నావని నిందితుడ్ని ప్రశ్నించిన పాపానికి.. అతని తరఫు వ్యక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో నందిని అనే వివాహితను నరేష్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి వేధిస్తూ వస్తున్నాడు. ఆమె తారసపడినప్పుడల్లా.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేధించాడు. తనకు ఇలాంటివన్నీ నచ్చవని, తన వెంట పడొద్దని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినా.. నరేష్ వినకుండా ఆమె వెంటపడ్డాడు.
Malavika Mohanan: నయనతారని లేడీ సూపర్ స్టార్ అనకండి… నాకు నచ్చట్లేదు
ఈ విషయం తన మామకు నందిని తెలియజేయగా.. ఆయన నరేష్ ఇంటికి వెళ్లి నిలదీశాడు. బాగా తిట్టి.. నందిని జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. దీంతో కోపాద్రిక్తుడైన నరేష్.. తన గుంపుని వేసుకొని, నందిని కుటుంబసభ్యులపై దాడికి వెళ్లాడు. తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఎటాక్ చేశారు. ఈ ఘటనలో నందిని బామ్మర్ది, అత్తతో పాటు మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్య కోసం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. దాడి చేసినవారిలో నరేష్‌తో పాటు అతని స్నేహితులు పవన్, లోకేష్, రమణ ఉన్నారు.
GVL Narasimha Rao: కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలి