Site icon NTV Telugu

Amit Shah: పాట్నాలో ఫోటో సెషన్ నడుస్తోంది.. విపక్షాల మీటింగ్‌పై సెటైర్లు..

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. కాశ్మీర్లో డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతకర్త, భారతీయ జన సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సాంబాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం శ్రీనగర్‌కు వెళ్లి అక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వితస్తా ఫెస్టివల్‌లో పాల్గొని అనంతరం భద్రతా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

జమ్మూ కాశ్మీర్ లో రాళ్ల దాడులు 90 శాతం తగ్గుముఖం పట్టాయని, 70 శాతం ఉగ్రవాదం తగ్గిందని ఆయన అన్నారు. రాళ్లకు బదులు ఇక్కడి యువత ల్యాప్‌టాప్‌లను తీసుకువెళుతున్నారని షా అన్నారు. వారు ఇప్పుడు దేశ నిర్మాణానికి తోడ్పడుతున్నారని, బీజేపీ ప్రభుత్వ కృషి వల్లే ఇది జరిగిందని ఆయన అన్నారు. కాశ్మీర్లో పెట్టుబడులు, పర్యాటకుల రాక పెరిగిందని ఆయన అన్నారు.

Read Also: Rahul Gandhi: తెలంగాణలో గెలుస్తాం.. ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ కనబడకుండా చేస్తాం…

ఈ రోజు బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న విపక్షాల సమావేశంపై అమిత్ షా సెటైర్లు వేశారు. వారు మోడీని సవాల్ చేస్తున్నామనే సందేశం ఇవ్వాాలని అనుకుంటున్నారు.. కానీ ఏం చేసినా, ఎప్పటికీ ఐక్యంగా ఉండలేరని అన్నారు. పాట్నాలో విపక్ష నేతల సమావేశాన్ని ఫోటో సెషన్ గా అభివర్ణించారు. 2024 ఎన్నికల్లో 300కు పైగా స్థానాల్ని సాధించి మరోసారి నరేంద్రమోడీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు.

మరోవైపు ఈ సమావేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దొంగలంతా ఒక్కచోట చేరారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. బీజేపీని ఒంటరిగా ఓడించలేమని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఒప్పుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వారసత్వ రాజకీయాలు, వారి కుటుంబాలను కాపాడుకునేందుకు విపక్షాలు మీటింగ్ నిర్వహిస్తున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కుటుంబాలను కపాడుకునేందుకు విపక్షాలు ఏకం అవుతున్నాయని.. 2024 ఎన్నికల్లో బీజేపీ 400 పైగా స్థానాలు గెలుస్తుందని బీజేపీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version