Petrol at Rs 1 per litre: అక్కడ రూపాయికే లీటర్ పెట్రోల్.. మరి ఊరుకుంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రో ధరలు మంట మండుతున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో ధరలకు బ్రేక్ పడినా.. ఆ తర్వాత 16 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను వడ్డిస్తూ వచ్చాయి చమురు సంస్థలు.. దీంతో.. పెట్రోల్ కొట్టించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. డీజిల్ పోయించాలంటే.. లెక్కలు వేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. అయితే, ఓ పెట్రోల్ బంక్ యజమానికి నచ్చిన నేత పుట్టిన రోజు రావడంతో.. స్థానికులకు బంపరాఫర్ ఇచ్చాడు.. రూపాయికే లీటర్ పెట్రోల్ అందించాడు.. అయితే, దానికి వెనుక చిన్న షరతులు పెట్టాడు..
Read Also: Centre: కేంద్రం షాకింగ్ నిర్ణయం.. 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
ఇక, రూపాయికే లీటర్ పెట్రోల్ సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఓ పెట్రోల్ పంప్ యజమాని ఈ ఆఫర్ తెచ్చాడు.. తనకు నచ్చిన నేత, శివసేన ఎమ్మెల్యే సర్నాయక్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఇవాళ మాత్రమే ఆ ఆఫర్ అందుబాటులో ఉంది.. అది కూడా.. మొదట వచ్చిన వెయ్యి మందికి మాత్రమే రూపాయికే లీటర్ పెట్రోల్ అందించారు.. దీంతో.. పెట్రోల్ కొట్టించుకోవడానికి వాహనదారులు పోటీపడ్డారు.. దీని వెనుక నచ్చిన నేత పుట్టినరోజే కాదు.. వేరే కోణం కూడా ఉంది.. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఇదో ప్రత్యేక మార్గమని చెబుతున్నారు.. సామాజిక కార్యకర్త సందీప్ డోంగ్రే, అబ్దుల్ సలామ్ సహాయంతో థానే మున్సిపల్ మాజీ కార్పోరేటర్ ఆశా డోంగ్రే దీని కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేపై అభిమానం చాటుకోడంతోపాటు.. పెరిగిన పెట్రో ధరలకు నిరసన తెలపడం కూడా ఒకేసారి జరిగిపోయాయి.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!