Aadhaar Card: ఆధార్ కు వేలి ముద్ర అవసరం లేదు.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Card: మన దేశంలో ఆధార్ అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. అయితే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా దాని అవసరం ఏదో ఒక రూపంలో ఉంటుంది. అయితే కొందరి వేలిముద్రలు లేకపోవడంతో ఆధార్ కార్డు పొందడం కష్టంగా మారింది. వేలిముద్ర పడకపోవడంతో ఆధార్ కార్డుకు అర్హులు కాదంటూ వస్తున్నవార్తలకు కేంద్ర చెక్ పెట్టంది. వేలిముద్ర పడకపోయిన ఆధార్ కార్డు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డు పొందాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే వేళ్లు లేవని, వేలి ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్‌ను తిరస్కరించలేరని స్పష్టం చేశారు. వారందరికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేరళకు చెందిన జోసిమల్ పి.జోస్ అనే మహిళ తనకు వేళ్లు లేకపోవడంతో ఆధార్‌లో పేరు నమోదు చేసుకోలేకపోతున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ కు విజ్ఙప్తి చేశాడు. దీంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని స్పష్టం చేశారు. దీంతో కొందరు వేలుముద్ర పడకపోవడంతో ఆధార్ లేనివారు ఇది శుభవార్త అనే చెప్పాలి.
Read also: Sabarimala: శబరిమలలో అపశృతి.. ప్రాణాలు కోల్పోయిన 11 ఏళ్ల బాలిక
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోమ్ పట్టణంలో వేళ్లు లేని జోసిమోల్ పి.జోస్ అనే మహిళ తన ఇంట్లో ఆధార్ నమోదు చేసుకున్న విషయాన్ని శనివారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఆమె విషయంలో మంత్రి జోక్యం చేసుకుని ఆధార్‌ను అందించారు. వేలిముద్రలు ఇవ్వలేని వారు వేలిముద్రల ద్వారా, ఐరిస్ సరిగా లేనివారు ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికైనా వేలిముద్రలు, ఐరిస్ రెండూ లేకుంటే అవి లేకుండానే ఆధార్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అటువంటి వ్యక్తులు బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల క్రింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలన్నారు. ఆ వివరాలతో కూడిన బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. తమ వద్ద లేని వస్తువుల వివరాలను ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోటో తీయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన తర్వాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సూపర్‌వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుందన్నారు.
Venkatesh : ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న వెంకీ.. బాబాయ్ హోటల్ లో సందడి..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!