Deputy CM: ఇటీవల మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతాన్ని మరిచిపోకముందే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీస్ దేవ్డా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సివిల్ డిఫెన్స్‌లో శిక్షణ కోసం వచ్చిన వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజలతో పాటు సైన్యం దేశ ప్రధాని నరేంద్రమోడీ పాదాలకు నమస్కరించాలి అని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో…