NTV Telugu Site icon

Pawan Kalyan: వన్ నేషన్ వన్‌ ఎలక్షన్‌పై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. డీఎంకేపై పంచ్‌లు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: చెన్నైలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడులో చాలాకాలం పాటు పెరిగాను.. తమిళనాడును వదిలి ముప్పై ఏళ్లు అయ్యింది.. నేను తమిళనాడు వదిలి పెట్టి వెళ్లాను.. కానీ, నన్ను తమిళనాడు వదలలేదు.. తమిళనాడు నాపై చాలా ప్రభావం చూపించింది… ఇక్కడే రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక భావన, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను.. అందుకే తమిళనాడు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం, ఇష్టం.. తమిళనాడు నాకు నేర్పిన పాఠం‌.. నా జీవితంపై చాలా ప్రభావం చూపిందన్నారు.. అయితే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చాలా అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయి.. ఎన్నికల ఫలితాలు అప్పుడు ఈవీఏం గురించి మాట్లాడినట్లుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు..

Read Also: Sangita Bhil: హిందూ మతానికి ఆదర్శం ఈ “సంగీతా భిల్”, అత్తింటివారిని సనాతనంలోకి మార్చిన మగువ..

ఇక, డీఎంకేపై పంచ్‌లు వేశారు పవన్‌ కల్యాణ్.. ఎన్నికలలో వారు గెలిస్తే ఈవీఏంలు సూపర్ అంటారు.. ఓడిపోతే ఈవీఏంలు ట్యాంపరింగ్ అంటారా…? అని నిలదీశారు. అదేలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రెండు మాట్లాడుతారు‌‌‌… గతంలో కరుణానిధి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మద్దతుగా మాట్లాడితే అప్పుడు అద్భుతం అన్నారు… ఇప్పుడు మళ్లీ అదే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే డీఎంకే నేతలు‌ మోసం అంటున్నారు‌.. డీఎంకే నేతల తీరు ఎలా ఉందంటే అత్త పగలు కొడితే పాత కుండా.. కోడలు పగలు కోడితే కోత్త కుండా అంటూ తమిళంలో సామెత చెప్పారు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది.. దేశానికి, తమిళనాడుకు కొత్తదేమీ కాదు… 1952-67 వరకు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి… వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కోరుకున్నది మాజీ సీఎం దివంగత కరుణానిధి ‌.. ఇప్పుడు వారి కూమారుడు స్డాలిన్ వద్దు అంటున్నారు అని మండిపడ్డారు.

Read Also: Sangita Bhil: హిందూ మతానికి ఆదర్శం ఈ “సంగీతా భిల్”, అత్తింటివారిని సనాతనంలోకి మార్చిన మగువ..

వన్ నేషన్ వన్ ఎలక్షన్ల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగదు అన్నారు పవన్‌ కల్యాణ్.. అందుకు ఉదాహరణే గత రెండు ఎన్నికలలో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీ గెలుస్తున్నాయి‌. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు గెలిచింది.. ఏపీలో 2014 టీడీపీ, 2019లో మరో పార్టీ గెలిచింది.. గత ఎన్నికలలో కూటమీ ప్రభుత్వం ఎంపీ, అసెంబ్లీలో ఎన్నికలలో గెలిచింది.. ఆ గెలుపు ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి‌ అని గుర్తుచేశారు.. ఒడిస్సా, తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి… అక్కడ బీజేపీ లబ్ధి పొందలేదు‌. .ఆశించినంత గెలవలేదు కదా..? అని ప్రశ్నించారు. కానీ, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని డీఎంకే చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.. వన్ నేషన్ ,వన్ ఎలక్షన్ పై కరుణానిధి పుస్తకం లో రాశారు… డీఎంకే అధినేత స్టాలిన్ ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పునరాలోచించుకోవాలని సూచించారు.. నేను దక్షిణాదినేతనే… నేను ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు నే… అంతిమంగా ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఆ దిశగానే ఆలోచించాలి.. వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకూడదు.. ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కరుణానిధి కళ… ఆయన డ్రీమ్ అది… దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోటా ఎన్నికల జరగడం వల్ల ఇబ్బందులు పడాల్సివస్తోంది… దానివల్ల డబ్బులు, టైం, అభివృద్ధి పై ఎఫెక్ట్‌ పడుతుంది.. వాటి అన్నిటికి చెక్ పెట్టడానికే వన్ నేషన్, వన్ ఎలక్షన్.. ఎప్పుడు ఎలక్షన్లో ఉండడంవల్ల అధికారులు నేతలు దానిపైనే దృష్టి పెడుతున్నారు… దానివల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్..