అయ్యే ఊరికి వెళ్లిపోతున్నాం.. పెండింగ్ పనులు అలానే ఉన్నాయి.. ఇంకా బిల్లులు కట్టాల్సి ఉంది.. అనే టెన్షన్ అవసరం లేదు.. ఊరికి వెళ్లే ముందు.. నేరుగా రైల్వేస్టేషన్‌కే వెళ్లి.. అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం వచ్చేస్తోంది.. దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది.. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో రైలు టికెట్లతో పాటు.. బస్సు, విమాన టిక్కెట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కూడా వచ్చేస్తోంది.. బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను కూడా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసే కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందించనున్నారు.
Read Also: కరోనా కల్లోలం.. భారత్‌లో లక్ష దాటేసిన రోజువారి కేసులు..
ఈ సేవలను మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్‌గా వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నారు.. ఆ ఫలితాలను బట్టి క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ సేవలు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 44, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 13, నార్త్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 13, వెస్టర్న్ రైల్వేలో 15, నార్తర్న్ రైల్వేలో 25, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 12, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 56 ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇది అందుబాటులోకి వస్తే.. మరో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు.. ఈ కాలంలో అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నా.. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ నుంచే అన్ని కార్యకలాపాలు సాగిస్తున్నా.. కొన్ని విషయాల్లో సదరు సెంటర్లును సందర్శించాల్సి ఉంటుంది.. ఇప్పుడు, రైల్వేశాఖ ఆ అవసరాలను కూడా తీర్చేందుకు సిద్ధం అవుతోంది.
