ఓ ప్యాసింజర్లో రైలులో మంటలు చెలరేగి తడలబడ్డ ఘటన యూపీలో చోటు చేసుకుంది. కాస్గంజ్ నుండి ఫరూకాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాస్గంజ్ నుంచి ఫరూకాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తరువాత కొద్ది సేపటికీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీని గమనించిన రైల్వే స్టేషన్లోని అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాప సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 3 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.