Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Winter Session 2026: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోపు పార్లమెంట్ తదుపరి సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అప్పటివరకు విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు సమాచారం. కీలక బిల్లులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా సిద్ధంగా ఉండాలని, తమ తమ శాఖలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. అయితే సమావేశాల ప్రారంభ తేదీ, వ్యవధిపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
Also Read
- US Tariff Threat: భారత్‌పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
- Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
- Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్...! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
- AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణలో జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆగస్టు 13న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, బుధవారం రాత్రి నాటికి వర్షాకాల సమావేశాలకు అధికారికంగా ముగింపు పలకలేదు. అప్పటికి 103 రోజులు గడిచింది. పార్లమెంట్ సమావేశాలను అధికారికంగా ముగించే ప్రక్రియను ‘ప్రొరోగేషన్’ (Prorogation) అంటారు. సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రతిపాదన నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవడం అంత సులభం కాకపోవచ్చు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం.
ప్రస్తుత లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు గాను మూడు ఖాళీలు ఉండటంతో 540 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య ఆధారంగా మూడింట రెండొంతుల మద్దతు లెక్కిస్తే 360 మంది సభ్యుల ఓట్లు అవసరమవుతాయి. అయితే బిల్లుకు మద్దతు అవసరమైన సంఖ్యను లెక్కించే విధానం సభలో హాజరై ఓటు వేసే సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి 320 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే ప్రతిపక్ష పార్టీల నుంచి అదనపు మద్దతు అవసరం. ఏప్రిల్‌లో లోక్‌సభలో ఈ బిల్లు ఓడిపోయిన తర్వాత రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష శిబిరం నుంచి 26 మంది ఎంపీలు బయటకు వచ్చారు. వారిలో 20 మంది తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమై ఎన్డీఏకు మద్దతు ప్రకటించినట్లు పేర్కొంది. మరో ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు తెలిపింది.
ఈ మార్పులతో ప్రభుత్వానికి కొంత బలం పెరిగినప్పటికీ, రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మద్దతు సాధించడానికి ఇంకా ఇతర పార్టీల సహకారం అవసరం. 22 మంది లోక్‌సభ ఎంపీలున్న డీఎంకే, ఎనిమిది మంది ఎంపీలున్న ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) కీలక పాత్ర పోషించే అవకాశముంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం ఉండటంతో శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సభలో ప్రశాంత వాతావరణం లేకుండా రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని అధికార కూటమికి చెందిన ఓ ఎంపీ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జరుగుతున్న సమావేశాలను పొడిగించాలంటే కనీసం రెండు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. కొత్త సమావేశాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు అవసరం.
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమ పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాల్లో సమానంగా లోక్‌సభ స్థానాలను పెంచే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల వాటాను కొనసాగించే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఫార్ములాపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రాజకీయ పరిణామాలన్నింటికీ కేంద్రంగా ఉన్నది రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు, 2026. ఏప్రిల్ 17న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అవసరమైన మద్దతు సాధించలేకపోయింది. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెడతారా? మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రతిపక్షాల మద్దతు లభిస్తుందా? అనే అంశాలు కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
-
Anirudh-Jonita Gandhi: మాజీ ప్రేయసిని రిసెప్షన్‌కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా.. అనిరుధ్ సర్ గ్రేట్!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
-
Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!