Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.