1.63 Lakh Indians Relinquish Indian Citizenship in 2021, over 78K Settled in USA: భారత పౌరసత్వాన్ని వదలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాలు, మెరగైన జీవితం కోసం భారతీయులు ఇతర దేశాల్లో సెటిల్ అవుతున్నారు. తాజాగా పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం సభలో వివరాలను వెల్లడించారు. భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని ఏఏ దేశాల్లో సెటిల్ అవుతున్నారనే వివరాలను ఆయన సభకు తెలిపారు. 2021లో 1,63,370 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని త్యజించారు. 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి వివరాల గురించి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు.
భారత దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారిలో ఎక్కువగా అమెరికా పౌరసత్వం పొంది అక్కడే సెలిట్ అవుతున్నారని వెల్లడించారు. గరిష్టంగా 78,284 మంది అమెరికన్ సిటిజెన్ షిప్ పొందారని తెలిపారు. ఆస్ట్రేలియాలో 23,533 మంది పౌరసత్వం తీసుకోగా.. కెనడాలో 21,597 మంది, యూకేలో 14,637 మంది పౌరసత్వాన్ని పొందారు. పౌరులు తమ వ్యక్తిగత కారణాల వల్లే పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు వెల్లడించారు. భారతీయులు భారతీయ పౌరసత్వం వదులుకని 103 దేశాల పౌరసత్వం పొందినట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. 2021లో 41 మంది భారత పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్ లో స్థిరపడ్డారు.
Read Also: Fahadh Faasil: పుష్ప రెండో పార్ట్‌తో ఆగేది కాదు.. మూడోదీ ఉంది!
ఈ దేశాల్లో అంగోలా, అర్జెంటీనా, ఆర్మేనియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అజర్‌బైజాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బెల్జియం, బోట్స్వానా, బ్రెజిల్, బ్రూనై, బల్గేరియా, బుర్కినా ఫాసో, కెనడా, చిలీ, చైనా, కొలంబియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, డెన్మార్క్, , యునైటెడ్ కింగ్‌డమ్, ఇథియోపియా, ఫిజి, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్ జర్మనీ, ఘనా, గ్రీస్, హంగేరి, ఐస్‌లాండ్, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇటలీ, జమైకా, జపాన్, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, కువైట్, లావోస్, మడగాస్కర్, మలావి, మలేషియా , మాల్దీవులు, మాలి మాల్టా, మారిషస్, మెక్సికో, మంగోలియా, మొరాకో, మొజాంబిక్, మయన్మార్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, నార్వే, ఒమన్, పాకిస్తాన్, పనామా, పాపువా న్యూ గినియా, పెరూ, ఫిలిప్పీన్స్, పోలాండ్, పోర్చుగల్, ఖతార్, ఐర్లాండ్, రీయూనియన్ ఐలాండ్, రొమేనియా, రష్యా, సౌదీ అరేబియా, సెర్బియా, సీషెల్స్, సింగపూర్, స్లోవేకియా, స్లోవేనియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, స్పెయిన్, శ్రీలంక, సుడాన్, సురినామ్, స్వీడన్, స్విట్జర్లాండ్, టాంజానియా, థాయిలాండ్, ట్రినిడాడ్ మరియు టొబాగో , టర్కీ, ఉగాండా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఎస్ఏ, వెనిజులా, జాంబియా, జింబాబ్వే ఇతర దేశాలలో ఉన్నాయి.