Parliament: సంభాల్, మణిపూర్ అల్లర్లతో పాటు అదానీ అవినీతిపై చర్చించాలని విపక్షాల డిమాండ్
- ప్రారంభమైన గంటకే వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు..
- అదానీ అవినీతితో పాటు సంభాల్, మణిపూర్ అల్లర్లపై చర్చించాలని విపక్షాలు డిమాండ్..
- మధ్యాహ్నం వరకూ లోక్‌సభ వాయిదా.. సోమవారానికి రాజ్యసభ వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: ఐదు రోజు ప్రారంభమైన గంటకే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ అవినీతి అంశంతో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన, మణిపూర్ వివాదం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. సభలో తక్షణమే చర్చించాలని పట్టుబడుతూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతునే ఉంది. నాలుగోరోజైన ఈరోజు (నవంబర్ 29) కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, లోక్‌సభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారాని(డిసెంబర్ 2)కి వాయిదా పడింది.
Read Also: Life Certificate For Pensioners: ఆ పని చేయలేదా? అయితే ఇక పింఛను అందుకోలేరు
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
అయితే, ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలు.. సెషన్స్ మొదలవ్వగానే రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో సభను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ అవినీతి వ్యవహారంపై చర్చకు విపక్షాల డిమాండ్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!