NTV Telugu Site icon

Parliament: సంభాల్, మణిపూర్ అల్లర్లతో పాటు అదానీ అవినీతిపై చర్చించాలని విపక్షాల డిమాండ్

Parlament

Parlament

Parliament: ఐదు రోజు ప్రారంభమైన గంటకే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ అవినీతి అంశంతో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన, మణిపూర్ వివాదం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. సభలో తక్షణమే చర్చించాలని పట్టుబడుతూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతునే ఉంది. నాలుగోరోజైన ఈరోజు (నవంబర్ 29) కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, లోక్‌సభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారాని(డిసెంబర్ 2)కి వాయిదా పడింది.

Read Also: Life Certificate For Pensioners: ఆ పని చేయలేదా? అయితే ఇక పింఛను అందుకోలేరు

అయితే, ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలు.. సెషన్స్ మొదలవ్వగానే రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో సభను డిసెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ అవినీతి వ్యవహారంపై చర్చకు విపక్షాల డిమాండ్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.