Site icon NTV Telugu

SIR: దేశ వ్యాప్తంగా ‘‘SIR’’ అమలుకు ఎన్నికల సంఘం సిద్ధం..!

Sir

Sir

SIR: ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదిలా ఉంటే, బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాలపై ఎస్ఐఆర్ అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులతో సెప్టెంబర్ 10న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంస్థ సమావేశమవుతోంది.

Read Also: UP Samosa Fight: సమోసా తీసుకురాని భర్త.. పొట్టుపొట్టు కొట్టిన భార్య

ఎస్ఐఆర్‌ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, కొన్ని సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణంలో ఈ వార్తలు బయటకు వచ్చాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్య వల్ల చాలా మంది పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేరని ప్రతిపక్షాలు సుప్రీంని ఆశ్రయించాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు దీనిని ‘‘రాజ్యాంగ ఆదేశం’’గా పేర్కొంది. రాజ్యాంగ సంస్థ పనితీరులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇటీవల బీహార్‌లో ఈ ప్రక్రియ ద్వారా 65 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేశారు.

Exit mobile version