Tamilnadu: పన్నీర్ సెల్వంకు మరో షాక్.. 18 మందిపై బహిష్కరణ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన అన్నాడీఎంకే.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వంను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి బహిష్కరణ వేటు వేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వీరంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పళనిస్వామి చెప్పారు.
పన్నీర్ సెల్వం కుమారుల్లో ఒకరు రవీంద్రనాథ్ తేని నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు జయప్రదీప్, మాజీ మంత్రి ఎన్ నటరాజన్పైనా పార్టీ వేటు వేసింది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. వీరంతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, అన్నాడీఎంకేకు చెడ్డ పేరు తెచ్చారని ఓ ప్రకటనలో పళనిస్వామి తెలిపారు. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. పన్నీర్ సెల్వంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!