Site icon NTV Telugu

Pakistan: భారత్, ఆఫ్ఘాన్‌లతో యుద్ధానికి సిద్ధం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Khawaja Asif

Khawaja Asif

Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read Also: Al Falah University: అల్‌-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ.. న్యాక్‌ షోకాజ్ నోటీసులు

ఒక బహిరంగ కార్యక్రమంలో ఆసిఫ్ మాట్లాడుతూ.. మేము రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. మాకు మొదటి రౌండ్(ఆపరేషన్ సిందూర్) సమయంలో అల్లా మాకు సహాయం చేశాడు.రెండో రౌండ్‌లో కూడా ఆయన మాకు సాయం చేస్తాడని అన్నారు. మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12 మంది మరణించారు, మరో 36 మందిగా గాయపడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్ (TTP) బాధ్యత వహించింది.

దీనికి ఒక రోజు ముందు ఆసిఫ్ ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్‌ను తక్కువ చేసి మాట్లాడారు. ఇది కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమే అని అన్నారు. దీనికి పాకిస్తాన్‌ను నిందించే అవకాశం ఉందని, మరోసారి భారత్ పాకిస్తాన్‌పై దురాక్రమణకు దిగిని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, భారత్ దీనిని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు.

Exit mobile version