NTV Telugu Site icon

Danish Kaneria: “పాకిస్తాన్ హిందువులు స్వేచ్ఛగా ఉపిరి పీల్చుకుంటారు”.. సీఏఏకి మద్దతుగా పాక్ మాజీ స్టార్ క్రికెటర్..

Danish Kaeria

Danish Kaeria

Danish Kaneria: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ డానిష్ కనేరియా భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు మద్దతు తెలిపారు. 2015కి ముందు భారత్‌కి తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించి, సీఏఏ నిబంధనలు పాకిస్తానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్తానీ హిందువులు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకోగలుగుతారు అని కనేరియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఏఏని అమలు చేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి, హోమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Himanta Biswa Sarma: “అదే జరిగితే నేను రాజీనామా చేస్తా”.. సీఏఏపై అస్సాం సీఎం..

పాకిస్తాన్ క్రికెట్ టీంలో లెగ్ స్పిన్నర్‌గా సేవలందించిన డానిష్ కనేరియా, ఆ జట్టుకు ఆడిన రెండో హిందువుగా ప్రసిద్ధి చెందారు. అనిత్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీంకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల పాక్ జట్టులో తనపై ఇతర క్రికెటర్లు చూపిన మతవివక్షను కూడా ఆయన వెల్లడించారు. తాను హిందువు అని, అఫ్రిది వంటి ఆటగాళ్లు తనపై వివక్ష చూపించేవారని పేర్కొన్నారు. పాకిస్తాన్ తరుపున 2000-2010 క్రికెట్ ఆడిన కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు పగగొట్టారు. 18 వన్డేలు ఆడారు.

సోమవారం సీఏఏని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉండీ, మతవివక్ష ఎదుర్కొంటూ భారత దేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి ఈ దేశ పౌరసత్వాన్ని ఇస్తుంది. ముస్లిమేతర హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు పార్సీకు పౌరసత్వం రానుంది. డిసెంబర్ 21, 2014కి ముందు దేశానికి వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.