Site icon NTV Telugu

Sikh Referendum: సిక్కు వేర్పాటువాదులతో పాకిస్తాన్ సమావేశం..

Sikh Referendum

Sikh Referendum

Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్‌బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పాక్ అసలు ఎజెండా మాత్రం వేరేలా ఉంది.

ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్న శ్రీ దశమేష్ దర్బార్, గురునానక్ సిక్కు గురుద్వారాలను సందర్శించారు పాక్ అధికారులు. వేర్పాటువాద నేతలో రహస్యంగా సమావేశం అయ్యారు. గురునానన్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ అని స్నేహితులు చేతనే ఈ దశమేష్ దర్బార్ గురుద్వారా నిర్వహించబడుతోంది. నిజ్జర్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి. అతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. నాలుగు ఎన్ఐఏ కేసుల్లో ఇతడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నిజ్జర్ గతంలో ఓ హిందూ పురోహితుడిని చంపేందుకు ప్రయత్నించాడు.

Read Also: Funds for Bhanzu: ‘ప్రపంచంలోనే ఫాస్ట్‌ హ్యూమన్‌ క్యాలికులేటర్‌’ భాను సంస్థకి రూ.115 కోట్ల ఫండ్స్

కెనడాలోని జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తుందని ప్రకటించినప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సిక్కువేర్పాటువాదులు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ తో పాటు, యూఎస్ లో ఉంటున్న వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పంజాబ్ ప్రత్యేక దేశం కావాలంటూ.. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ సిక్కు ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాహెర్ లో ఆశ్రయం ఇస్తోంది. వేర్పాటువాదం వెనక పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఉంది.

సిక్కు రిఫరెండంపై గురువారం కెనడాకు భారత్ తన నిరసనను తెలియజేసింది. మిత్రదేశం కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Exit mobile version