India Pakistan War: ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు జరిపిన పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధ సామర్థ్యం గల షాహీన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే, ఈ క్షిపణినీ భారతదేశం తన S-400 రక్షణ వ్యవస్థతో అడ్డుకుంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను భారత సైన్యం యొక్క వెస్ట్రన్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాకిస్తాన్ చేసిన క్షిపణి దాడులను, క్రాస్-ఫైరింగ్ సమయంలో భారత్ గగనతల రక్షణ వ్యవస్థలతో ఎలా నాశనం చేసిందో చూడాలని తెలిపారు. పాకిస్తాన్‌లో ధ్వంసం చేయబడిన వైమానిక స్థావరాల యొక్క ఉపగ్రహ ఛాయ చీత్రాలను కూడా ఇందులో షేర్ చేసింది.
Read Also: IPL 2025: దడ పుట్టిస్తున్న ప్లేఆఫ్స్ లెక్కలు.. ఒకటే పోస్ట్.. 3 జట్లు పోటీ
అయితే, పాకిస్తాన్ షాహీన్ క్షిపణి భూమి నుంచి ప్రయోగించగల మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి.. దీనిని మొదటిసారి మార్చి 2015లో పరీక్షించారు. ఈ క్షిపణి అణ్వాయుధ, సాంప్రదాయ పేలోడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదించబడింది. కానీ, ఈసారి దీనిని అణ్వాయుధేతర వార్‌హెడ్‌తో ఉపయోగించారు. అయితే, రష్యా తయారు చేసిన S-400 క్షిపణితో ఆ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుంది భారతదేశం. ఇక, S-400లో మూడు భాగాలు ఉన్నాయి – క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా ఢీకొట్టగలదు. ఇది సుదూర సామర్థ్యాల కారణంగా ఈ క్షిపణిని NATO సభ్య దేశాలు ప్రధాన ముప్పుగా భావిస్తున్నాయి.