Pakistan: భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్‌కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు పాక్, ఆఫ్ఘన్ల మధ్య ఎప్పటి నుంచి సరిహద్దు వివాదం ‘‘డ్యూరాండ్ రేఖ’’తో ముడిపడి ఉంది. ఇప్పుడు, భారత్‌తో ఆఫ్ఘాన్ సంబంధాలు బలపడటం పాకిస్తాన్‌ను కలవరపెడుతోంది.
తాజాగా, భారత్-ఆఫ్ఘాన్ ఉమ్మడి ప్రకటనపై పాకిస్తాన్ నిరసన తెలిపింది. న్యూఢిల్లీలో అమీర్ ఖాన్ ముత్తాఖీ చేసిన వ్యాఖ్యల్ని పాక్ వ్యతిరేకించింది. పాకిస్తాన్, తన నిరసనను ఆఫ్ఘాన్‌కు తెలియజేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో, కాశ్మీర్‌ను భారతదేశంలో భాగంగా పేర్కొనడంపై “తీవ్రమైన అభ్యంతరాలు” వ్యక్తం చేసింది, దీనిని “సంబంధిత UN భద్రతా మండలి తీర్మానాల స్పష్టమైన ఉల్లంఘన” అని పేర్కొంది.
Read Also: Saudi Arabia Military Support: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధంలోకి సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తుందా?
జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో భాగంగా పేర్కొనడం యూఎన్ భద్రతా మండలి తీర్మానాలను, జమ్మూ కాశ్మీర్ చట్టపరమైన హోడానున స్పష్టంగా ఉల్లంఘించడమే అని, భారత్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ప్రజల త్యాగాలు, మనోభావాలను ఉమ్మడి ప్రకటన సరిగా లేదు అని ఒక ప్రకటనలో పాకిస్తాన్ చెప్పింది.
ప్రాంతీయ దేశాల నుంచి వెలువడే అన్ని ఉగ్రవాద చర్యల్ని భారత్, ఆఫ్ఘాన్లు ఖండించాయి. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసాన్ని ప్రోత్సహించడం ప్రాముఖ్యతను భారత్-ఆఫ్ఘాన్లు నొక్కిచెప్పాయి. ముత్తాఖీ తన పర్యటనలో.. భారత్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ నెల ఎప్పుడూ ఉపయోగించబడదని హామీ ఇచ్చారు. మరోవైపు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆప్ఘాన్ పాకిస్తాన్‌పై ఫైర్ అవుతోంది.
