NTV Telugu Site icon

Yogi Adityanath: ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పీఓకే కలుస్తుంది..

Yogi

Yogi

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు. జమ్మూలోని ఆర్‌ఎస్‌ పురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు. అలాగే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.

Read Also: Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ ల పై ఈటల సెటైర్లు..

కాగా, పాకిస్థాన్ లో పెరుగుతున్న ఆహార ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు సైతం భారత్ లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే.. అది సానుకూల సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆరు నెలల్లో భారత్‌లో భాగమవుతుందని ఆ సమయంలో తాను చెప్పినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.

Read Also: China Disruption : చైనా వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి..!?

అయితే, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. మరో 40 స్థానాలకు మూడో దశలో అక్టోబర్ 1వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అక్టోబరు 8వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుది ఫలితాలు వెలువడనున్నాయి.