NTV Telugu Site icon

Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..

Pakistam3

Pakistam3

Pakistan: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ లోలోపల భయపడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్, భారత ఎదుగుదల, ప్రధాని నరేంద్రమోడీకి దొరుకుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటనపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్ స్పందించారు. భారత్‌తో అమెరికా తన సంబంధాలను మరింతగా పెంచుకోవడంతో ఇస్లామాబాద్‌కు ఎలాంటి సమస్య లేదని అన్నారు. అయితే పాకిస్తాన్ కు నష్టం కలిగించకపోతే, భారతదేశంతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న అమెరికాతో మాకు ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు.

Read Also: Mahindra’s Armado: ఆర్మీ కోసం మహీంద్రా “ఆర్మడో”.. బండి మామూలుగా లేదుగా..!

కాశ్మీర్ సమస్యపై గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా.. పాకిస్తాన్ తన పొరుగు దేశాలు, ప్రాంతీయ భాగస్వాములతో సత్సంబంధాలను కోరుకుంటోందని మంత్రి అన్నారు. మాకు చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ తో ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయి. మేము అందరితో సత్సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటున్నామని, శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామని అన్నారు. శాంతి లేకుంటే ఆర్థికంగా ఎదగడం ఎప్పటికీ జరగదని ఖవాజా ఆసిఫ్ అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. జూన్ 20న మోడీ న్యూయార్క్ చేరుకోనున్నారు.. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. భారత-అమెరిన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 22న మోడీకి అధికారిక స్వాగత వేడుకను చూసేందుకు భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికా రాజధానికి వెళ్లనున్నారు.అదే రోజు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి ప్రెసిడెంట్ జోబైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ వైట్ హౌజులో ఇవ్వనున్నారు.