Site icon NTV Telugu

Pakistan: భారత్‌పై పాకిస్తాన్ ఏడుపు.. ఆఫ్ఘనిస్తాన్‌ను మాపై వాడుతున్నారని ఆరోపణ..

Pakistan

Pakistan

Pakistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్‌లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం’’గా, పాకిస్తాన్‌ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.

Read Also: Crime: వైద్యం పేరుతో మహిళపై అత్యాచారం.. నిందితుడు హిమాచల్ బీజేపీ చీఫ్ సోదరుడు..

పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ (DG) లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పెషావర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరుగుతున్న భయంకరమైన దాడుల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో పాకిస్తాన్ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి.

2021లో అమెరికన్ దళాలు వదిలిపెట్టిన ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు అందాయని, ఈ సంక్షోభానికి ఇది కూడా కారణమని చౌదరి చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డను విదేశాలు, ఉగ్రవాదులు ఉపయోగించుకోనివ్వద్దు అని ఆయన అన్నారు. పాక్ తాలిబాన్లు, ఐసిస్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి వాటికి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపించాడు. ఈ సంస్థలు మతానికి, సంస్కృతికి సంబంధించినవి కావని, ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి పనిచేస్తాయని అన్నారు. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిమ్ పాక్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ఆఫ్ఘాన్ శరణార్థులకు స్థానం ఇస్తే, ఇప్పుడు మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు.

Exit mobile version